నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలవేణి దేవిని సీబీఐ అధికారులు గురువారం విచారించారు. అనంతరం ఆస్పత్రిలో సుధాకర్ సర్వీసు రికార్డు, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కేసులో సుధాకర్ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.
డా.సుధాకర్ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించిన సీబీఐ - డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ వార్తలు
మత్తు వైద్యుడు సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలవేణి దేవిని సీబీఐ అధికారులు విచారించారు.
సుధాకర్ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించి సీబీఐ
TAGGED:
sudhakar case news