ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GANJA: గంజాయిపై అవగాహన.. తోటలు ధ్వంసం చేసిన సాగుదారులు

గంజాయి సాగుకు అడ్డాగా మారిన విశాఖ మన్యంలో మత్తును దించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో సీలేరు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గంజాయి తోటలను ధ్వంసం చేసిన సాగుదారులు
గంజాయి తోటలను ధ్వంసం చేసిన సాగుదారులు

By

Published : Oct 20, 2021, 8:27 PM IST

విశాఖ జిల్లా మన్యంలో గంజాయిని అక్రమంగా పండిస్తున్న దారకొండ, గుమ్మిరేవుల, దుప్పిలవాడ గ్రామాల్లో సీలేరు ఎస్ఐ రంజిత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి సాగు, రవాణా వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గంజాయి సాగు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు. తద్వారా గంజాయి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు.

అవగాహన కార్యక్రమంతో గిరిజనుల్లో మార్పు వచ్చింది. సాగుదారులే స్వయంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఇకపై గ్రామాల్లో గంజాయి సాగు చేయమని, కొనుగోలు కోసం వచ్చే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details