నర్సీపట్నంలో ముమ్మరంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
పురపాలక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. తమ అభ్యర్థులను గెలిపించుకోవటం కోసం నేతలు పోటీపడుతున్నారు. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో పురపాలక ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. 16వ వార్డులో భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి తరపున పోటీ చేస్తున్న వెంకటలక్ష్మి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్రం ప్రవేశపెడుతున్నట్టు ప్రచారం చేసుకుంటోందని అభ్యర్థి వెంకటలక్ష్మి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు.
ఇవీ చూడండి:బిడ్డకు పాలిస్తుండగా.. అమ్మ స్తనంపై పాముకాటు