విశాఖ ఏజెన్సీ పాడేరు డిపో నుంచి ప్రజా రవాణాకు బస్సులు బయలుదేరాయి. పాడేరు నుంచి తొలి సర్వీస్‌ను విశాఖపట్నానికి ప్రారంభించగా మొత్తం 14 సర్వీసులను నడపనున్నారు. లాక్‌డౌన్ తర్వాత ప్రారంభమైన తొలి సర్వీసులు కావడం స్వల్ప ప్రయాణికులతో బస్సులు బయలుదేరాయి. ఉదయం నుంచి డిపో మేనేజర్ నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటైజేషన్, మాస్కులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనిల సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం విశాఖపట్నం, అరకు లోయ, ముంచంగిపుట్టు, చింతపల్లి, రాజమండ్రి నగరాలకు బస్సు సర్వీసులను ప్రారంభించారు.
పాడేరు నుంచి బస్సు సర్వీసుల ప్రారంభం - విశాఖ ఎజెన్సీ నుంచి ప్రారంభమైన బస్సుల వివరాలు
విశాఖ ఏజెన్సీ పాడేరు డిపో నుంచి విశాఖపట్నానికి మొదటి బస్సు సర్వీసును ప్రారంభించారు. లాక్‌డౌన్ అనంతరం బస్సులు ప్రజా రవాణాకు సిద్ధం కావడం డిపో మేనేజర్ నాయుడు.. సిబ్బందికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
పాడేరులో ప్రయాణం మొదలపెట్టిన బస్సులు