ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నుంచి త్వరలో భారీ చేరికలు: మాణిక్యాలరావు - విశాఖపట్నం జిల్లా

తెదేపా పార్టీ ఖాళీ అవుతుందని అసెంబ్లీలో కూడా జీరో అవుతుందని భాజపా నాయకులు, మాజీ మంత్రి పత్తికొండ మాణిక్యాల రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా అవతరించబోతుందని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాణిక్యాలరావు

By

Published : Jul 17, 2019, 10:25 AM IST

Updated : Jul 17, 2019, 11:37 AM IST

సమావేశంలో మాట్లాడుతున్న మాణిక్యాలరావు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని అన్నారు భాజపా నేత మాణిక్యాలరావు. ఈనెల 6 నుంచి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సభ్యత్వం నమోదు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమ పార్టీ సభ్యత్వం నమోదు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని చిన్నచూపు చూసే ప్రయత్నం చేశారని... ఈ ప్రయత్నాలన్నీ ప్రజలు తిరస్కరించి మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని వివరించారు. ప్రజా తిరస్కారానికి గురైన తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విశ్వాసం లేదని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుందన్నారు .తెదేపా, జనసేన పార్టీ నుంచి తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు. ఎవరు వచ్చినా సరే ద్వారాలు తెరిచే ఉంటాయని తెలిపారు.

Last Updated : Jul 17, 2019, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details