ఒకే దేశం ఒకే జెండా అనే అజెండాతో ముందుకెళ్తున్న పార్టీ భాజపా అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయపేటలో రాష్ట్ర మత్స్యకారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలన,సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి, దేశ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి మోదీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కొనియాడారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35/A రద్దు చేసే ధైర్యం ఏ ఒక్క ప్రధానికి సాధ్య పడలేదని... ఆ ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
దమ్ము,ధైర్యం ఉన్న ప్రధాని మోదీ : కన్నా - amithsha
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయపేటలో రాష్ట్ర మత్స్యకారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలను స్వాగతిస్తూ ఆయన్ని ప్రశంసించారు.
దమ్ము,ధైర్యం ఉన్న ప్రధాని మోది: కన్నా
ఇవీ చూడండి-కశ్మీర్ భద్రత, భవితపై మోదీ భరోసా