ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ పోర్టు రోడ్డులో దారి దోపిడీ..20 లక్షలు అపహరణ

గాజువాక పోర్టు రోడ్డులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు వెళ్తోన్న ఓ వ్యక్తిని దుండగులు అడ్డగించి నగదుతో ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

పోర్టు రోడ్డులో వ్యక్తిపై దాడి..రూ. 20 లక్షలు చోరీ

By

Published : Aug 7, 2019, 7:28 PM IST

పోర్టు రోడ్డులో వ్యక్తిపై దాడి..రూ. 20 లక్షలు చోరీ

విశాఖ జిల్లా గాజువాక పోర్టు రోడ్డులో అగంతకులు రూ.20 లక్షల నగదు చోరీచేశారు. ఓ ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ చెందిన ఉద్యోగి శ్రీనివాస్ బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు శ్రీనివాస్​ను కొట్టి నగదు ఎత్తుకెళ్ళారు. పోర్టురోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో తనపై దాడి చేసి నగదు లాక్కున్నారని బాధితుడు తెలిపారు. బాధితుని ఫిర్యాదుతో దుండగుల కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details