విశాఖ మన్యం పాడేరు డిగ్రీ కళాశాల లేడీస్ హాస్టల్ సమీపంలో మృత శిశువు కలకలం సృష్టించింది.పాడేరు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం ఆవరణ గడ్డిలో కవర్లో చుట్టి మృతశిశువును,కుక్కలు పీకుతుండగా..స్థానికులు గుర్తించారు.ఈ విషయం ఉన్నతాధికార్లకు చేరడంతో ఐసీడీఎస్-సీడీపీఓ లలిత కుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.రెవెన్యూ పోలీసులు చేరుకుని,స్థానికులను విచారించారు.
మహిళా హస్టల్ సమీపంలో మృతశిశువు కలకలం - పాడేరు డిగ్రీ కళాశాల లేడీస్ హాస్టల్
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో..రోజుల కూడా నిండని మగ శిశువుని ప్లాస్టిక్ కవర్లో చుట్టి పడేసింది. పాడేరు మహిళా డిగ్రీ కళాశాల హస్టల్ సమీపంలో కనిపించిన ఈ మృత శిశువును కుక్కలు పీకుతుంటే, స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ప్లాస్టికవర్లో పసిబిడ్డ..కుక్కకు ఆహారమైయ్యాడు