Bahubali Ship to Visakha: విశాఖపట్నం ఓడరేవుకు శనివారం పొడవైన నౌక వచ్చింది. ‘ఎంవీ జీసీఎల్ సబర్మతి బేబీ కేప్’ పేరున్న ఈ నౌక పొడవు 253.50 మీటర్లు. వెడల్పు 43 మీటర్లు. ఒకే సారి 1,06,529 టన్నుల బరువైన సరకును తరలించే సామర్థ్యం ఈ నౌక సొంతం. ప్రస్తుతం సున్నపురాయి లోడుతో ఇక్కడకొచ్చింది. రేవులోని వెస్ట్‌క్వే-1 బెర్త్‌లో దీన్ని విజయవంతంగా నిలిపారు. విశాఖ ఓడ రేవులో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారని పోర్టు ట్రస్టు ఛైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు.
విశాఖలో కనువిందు చేసిన బాహుబలి నౌక.. పొడవు ఎంతంటే..! - విశాఖపట్నం తాజా వార్తలు
Bahubali Ship to Visakha: ఏపీ ఆర్ధిక రాజధానైన విశాఖపట్నం ఓడరేవుకు బాహుబలి నౌక వచ్చింది.. రేవుకు పక్కనే ఉన్నటువంటి పర్యాటక ప్రదేశం ఆర్కే బీచ్ నుంచి కాసేపు పర్యాటకులకు కనువిందు చేసింది.. విశాఖ ఓడరేవులో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారని పోర్టు ట్రస్టు ఛైర్మన్ తెలిపారు.
బాహుబలి నౌక