స్వామి మాలలో ఉన్న వ్యక్తి అయ్యప్ప పూజ ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన సత్యం (40) సుజాతనగర్ గొల్లపాలెంలో నివాసముంటూ నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సత్యం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని అయ్యప్ప భక్తుడు దుర్మరణం - rtc bus accident latest news update
విశాఖ జిల్లా పెందుర్తి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. స్వామిమాలలో ఉన్న బొబ్బిలి ప్రాంతానికి చెందిన వ్యక్తి... పూజ ముగించుకొని వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు.
ఆర్టీసీ బస్సు ఢీకొని అయ్యప్ప భక్తుడు దుర్మరణం