నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం - TDP PRACHARAM
పార్టీ ప్రచారాలతో ఊరూవాడా సందడిగా మారింది. ఎన్నికల వేళ ప్రచారాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాలు చేస్తున్నారు. నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం చేశారు.
AYYANA
విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం చెప్పారు. తెదేపా మేనిఫెస్టోలోని హామీలు వివరించిన అయ్యన్న.. మరోసారి పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలకు కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.