జిల్లాల పునర్విభజనలో భాగంగా విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక మందిరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖతోపాటు అరకు, అనకాపల్లి ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ పూర్తి చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారు. అంతకు ముందు జోగింపేట కూడలిలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణదేవిపేటలో అల్లూరి స్మారక మందిరం వద్ద మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రితో పాటు నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాకు అల్లూరి పేరు: మంత్రి ముత్తంశెట్టి
విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే విధంగా కృషి చేస్తామని...రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
విశాఖ జిల్లాకు అల్లూరి పేరు