ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సహాయ ఆచార్యుల పరీక్షను రద్దు చేయాలి'

సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షను రద్దు చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరీక్షలు సరైన పద్ధతిలో జరగలేదని వారు ఆరోపించారు.

'సహాయ ఆచార్యుల స్కీృనింగ్ పరీక్షను రద్దు చేయాలి'

By

Published : Jul 2, 2019, 7:24 PM IST

Updated : Jul 3, 2019, 12:02 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న సహాయ ఆచార్యులు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్ష వెంటనే రద్దు చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు ఆందోళన నిర్వహించారు. మొత్తం 14 విశ్వవిద్యాలయాల్లో రెండు విడతలుగా భర్తీ చేయవలసిన సుమారు 1109 ఖాళీలకు... అప్పటి ప్రభుత్వం 2017 డిసెంబర్లో ప్రకటన విడుదల చేసిందని వారు తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ పేరిట ఏపీపీఎస్సీకి ఆన్లైన్ పరీక్ష బాధ్యతలు అప్పగించి.. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని తుంగలో తొక్కిందని ఆరోపించారు. నిరుద్యోగ డాక్టరేట్లు, తాత్కాలిక అధ్యాపకులు, ఒప్పంద అధ్యాపకుల భవిష్యత్తును మరింత అగమ్యగోచరం చేశారని సహాయ ఆచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

2017లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే పోస్టులు భర్తీ చేయాలని సహాయ ఆచార్యులు నినాదాలు చేస్తూ... ఆంధ్ర యూనివర్సిటీలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ప్రస్తుతం ప్రభుత్వం అప్పట్లో జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ అవకతవకలపై తగు చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి....'వైకాపాకు సంక్షేమం కాదు.. కక్ష సాధింపే ముఖ్యం'

Last Updated : Jul 3, 2019, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details