ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జీఓ నెం3 రద్దుపై ప్రభుత్వాలు రివ్యూ పిటీషన్ వేయాలి'

By

Published : Apr 23, 2020, 6:36 PM IST

జీఓ నెం 3ను రద్దు చేస్తూ ఇచ్చిన సుప్రీం తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటీషన్ వేయాలని గిరిజన సంఘం విజ్ఞప్తి చేసింది.

AP Tribal Society requests central,state governments to respond for GO NO 3
జీఓ నెం 3 రద్దుపై పాడేరు మన్యంలో నిరసనలు

ఆదివాసీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకంలో వందశాతం రిజర్వేషన్ కల్పించే జీఓ నెం3ను సుప్రీం రద్దు చేయడంపై విశాఖ మన్యంలో గిరిజన సంఘం అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలంటూ ఇంటింటా ప్లకార్డులు పట్టుకుని సంఘం నాయకులు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి జీఓ నెం 3ను రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలనర్స కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details