విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కరోనాని జయించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా కరోనాని జయించవచ్చని అమర్నాథ్ చెప్పారు. గత నెల 20న ఆయనకు కరోనా సోకినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం 29న మరోసారి పరీక్షలకు వెళ్లగా… నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో శనివారం నుంచి ఆయన ప్రజాసేవకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు.
కరోనాను జయించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ - anakapalle mla latest news
హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుని కరోనా బారి నుంచి బయటపడినట్లు అనకాపల్లి ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా వ్యాధి నుంచి జయించవచ్చని చెప్పారు.
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్