విశాఖ ఉక్కు కర్మాగార భూములను దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి అప్పగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగార భూములను పోస్కోకు అప్పగించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మికులు ఈనెల 13న తలపెట్టిన ఛలో అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అఖిలపక్షం ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం.. పోస్కోను రానివ్వం' - విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం..పోస్కోను రానివ్వం..అఖిలపక్షం వార్తలు
విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. కేంద్రం కుట్రపూరితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని చూస్తోందని నేతలు ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 13న ఛలో అమరావతి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం..పోస్కోను రానివ్వం..