మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారికి విశాఖ ఎక్సైజ్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలను నడపటం వల్ల వచ్చే అనర్థాలను మానసిక వైద్య నిపుణులు వివరించారు. ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగర పోలీసు కమిషనరేట్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ పాపారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు లు నిబంధనలపై అవగాహన కల్పించారు. మందుబాబులతో ఇకపై మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపితే... ప్రాణాలు చిత్తే !
గత రెండు రోజులుగా విశాఖ నగర వ్యాప్తంగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన వారికి నగర కమిషనరేట్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల వచ్చే అనర్థాలను తెలియజేశారు.
ప్రాణాలు చిత్తే !