కరోనా సమయంలో ప్రజలకు వాలంటీర్లు అందించిన సేవలు అభినందనీయమని... అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కొనియాడారు. అనకాపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న 491 మంది గ్రామ వాలంటీర్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరం సరకులు పంపిణీ చేశారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి వరకు విశాఖ జిల్లా అంతటా 33 వేల మందికి అక్షయపాత్ర ఫౌండేషన్ నిత్యావసర సరకులు అందజేయడం ప్రశంసనీయని ఆయన అభినందించారు.