ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంచాయతీ ఆదాయానికి తూట్లు పొడిస్తే చర్యలు తప్పవు'

విశాఖ జిల్లా చోడవరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై పంచాయతీ అధికారిణి వి. కృష్ణకుమారి మండిపడ్డారు. పంచాయతీల ఆదాయానికి తూట్లు పొడిచే సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోనని ఆమె హెచ్చరించారు.

Breaking News

By

Published : Jul 13, 2020, 11:53 PM IST

విశాఖ జిల్లా చోడవరం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారిణి వి.కృష్ణకుమారి సమీక్ష నిర్వహించారు. అనధికారిక లేఅవుట్స్, నిబంధనలకు విరుద్ధంగా జరిపిన కట్టడాల నిర్మాణ విషయంలో కార్యదర్శులు, బిల్లు కలెక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కృష్ణకుమారి ఆగ్రహించారు. పంచాయతీల ఆదాయానికి తూట్లు పొడిచేలా పని చేస్తే సహించేది లేదన్నారు. సిబ్బంది పై చర్యలకు వెనుకాడబోనని ఆమె హెచ్చరించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 24 నుంచి గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని అన్నారు. డీటీపీసీపీ శ్రీదేవి, ఎంపీడీవో శ్యామ్ సుందర్, ఇవోఅర్డీ చైతన్య(చోడవరం), రవి (బుచ్చెయ్యపేట) చంద్రశేఖర్ (కొత్త కోట) పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details