ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాయానికి ఉన్నతాధికారి ముందడుగు..25 సార్లు రక్తదానం

ఆయనో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారి. మానవీయ సాయం అందించడంలో ఆయనకు ఆయనే సాటి. 25 సార్లు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో పలువురికి కొత్త జీవితాన్ని అందించారు. ఆయనే విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ఉమామహేశ్వర రావు.

vishakapatnam
vishakapatnam

By

Published : Aug 28, 2020, 7:28 PM IST

అవసరమైన వారికి సేవ చేయాలన్న దృఢమైన ఉక్కు సంకల్పం ఆయన రక్తంలోనే ఉంది. తన రక్తాన్ని దానం చేయడంలో ఉన్న ఆత్మానందాన్ని ఆస్వాదించే దాత విశాఖ ఉక్కు అధికారి ఎస్ ఉమామహేశ్వరరావు. ఉక్కు కర్మాగారంలో ఒక పక్క విధులు క్రమశిక్షణతో నిర్వహిస్తూ మరో పక్క సమాజ సేవలో తరిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చారు.

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్​గా విధులు నిర్వహిస్తున్న ఎస్ ఉమామహేశ్వర రావుది బి పాజిటివ్​ బ్లడ్ గ్రూప్. ఎవరికైనా రక్తం అవసరం ఉందన్న సమాచారం అందుకోవడమే ఆలస్యం... వెంటనే అక్కడికి చేరుకుంటారు. శ్రీ సత్య సాయి సేవా సమితి ద్వారా గత ఎన్నో ఏళ్లుగా రక్త దానం చేస్తున్నారు ఉమామహేశ్వరరావు.

ఇటీవల విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన ఒకరి తల్లికి రక్తం అవసరమయితే ఉమా మహేశ్వరరావు 25వ సారి రక్త దానం చేశారు. ఆమె కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మానవతాదృక్పథంతో ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే ఉమామహేశ్వరరావు 25 సార్లు రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు

ఇదీ చదవండి

ఆ కేసులో పోలీసులు ఎందుకు వెనక్కు తగ్గారు?: వర్ల

ABOUT THE AUTHOR

...view details