ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

By

Published : Jan 24, 2021, 10:37 AM IST

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా యస్ రాయవరం మండలంలో ఈ ఘటన జరిగింది.

farmer
విశాఖలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా యస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామానికి చెందిన రైతు పి. లోవరాజు.. పంట పెట్టుబడుల కోసం లక్ష రూపాయలు అప్పు చేశాడు.

సాగు కలిసిరాక తీవ్ర నష్టం వాటిల్లింది. చేసిన అప్పులు తీర్చలేక తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details