విశాఖ జిల్లా పద్మనాభం మండలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తుల సంతోష్ కుమార్‌కు శ్యామిలితో 2008 ఏప్రిల్ 10న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగ్గా..పోలీసుల చొరవతో సద్దుమణిగాయి. మళ్లీ భర్త సంతోష్, అతని తల్లి వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేని శ్యామిలి పిల్లలతో సహా ఆమె పుట్టింటికి వెళ్లింది.
ఈ క్రమంలో పిల్లలను చూడాలని ఉందని కానిస్టేబుల్ సంతోష్ కుమార్, అతని తల్లి పైడిరాజు ఈనెల 15న తగరపువలసలోని వారి ఇంటికి రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన శ్యామిలి పిల్లలతో సహా అత్తారింటికి వచ్చింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఇంటి డాబాపై నిల్చుని వేడుక చూస్తున్న శ్యామిలీపై.. ఆమె అత్త వెనుక నుంచి యాసిడ్ వంటి ద్రవాన్ని చల్లింది. వెనుకభాగం మండుతుండడంతో శ్యామిలి వెనుదిరిగి చూసింది. ఇంతలో అత్త పైడిరాజు ఒక బాటిల్‌తో కిందకి పారిపోతూ ఉండడం చూసి ఆమెను అనుసరించి చేతిలో ఏంటని ప్రశ్నించింది. వెంటనే ఆమె అత్త పైడిరాజు ఆ బాటిల్ ని దూరంగా విసిరేసి వెళ్లిపోయింది. శ్యామల ఆ బాటిల్ ని వెతికి దాచి పెట్టింది. ఆమె ఆ బాటిల్ పట్టుకున్న శరీర భాగం కూడా కాలిపోయింది. వెంటనే అత్తవారింటి నుంచి బయలుదేరి శ్యామిలి విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో ఎంఎల్‌సి చేయించుకున్నట్టు వివరించింది.
గతంలోనూ....