విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది కూడలిలో.. గంజాయిని తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిస్సా రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి 900 కేజీలు ఉన్నట్లు తెలిపారు. గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
900 కేజీల గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా వడ్డాది వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిస్సా రాష్ట్రానికి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి పట్టివేత