అమరావతిపై త్వరలోనే నిర్ణయం: మంత్రి బొత్స - city
రాజధాని అమరావతిపై ప్రభుత్వం చర్చిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.
రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. త్వరలోనే అమరావతి విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం పెరుగుతోందని..... ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలున్నాయని ప్రస్తుత వరదల కారణంగా తెలిసిందన్నారు. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా కాల్వలు, డ్యామ్‌లు నిర్మించడం లేదా ఆ నీటిని తోడటం వంటివి అదనపు ఖర్చులుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుస క్రమంలో స్థానికల సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మంత్రి బొత్స..... ప్రజాభిప్రాయంతోనే వార్డుల విభజన చేపడతామని స్పష్టం చేశారు.