తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు చెలరేగాయి. గోదాము లోపలి నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 7 గంటల పాటు కొనసాగిన మంటల కారణంగా... 25 కోట్ల రూపాయన మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. 25 కోట్ల నష్టం - fire
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ గోదాములో మంటలు చెలరేగాయి. రూ. 25 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.
అగ్నిప్రమాదం