కృష్ణాజిల్లా మట్టగుంటలో 9,10వ తరగతి చదివే విద్యార్థులు పడుతున్న అవస్థలపై ఈనాడు-ఈటీవీ భారత్ వరుస కథనాలపై స్పందన లభించింది. ప్రమాదకరమైన నదిని దాటి విద్యార్థులు చేస్తున్న సాహసాన్ని కలెక్టర్ ఇంతియాజ్ ప్రత్యక్షంగా చూశారు. గ్రామస్థులు, విద్యార్థులతో పరిస్థితిపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ గా గుర్తింపునిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. స్థానిక పాఠశాలలో 9, 10 తరగతులు లేకపోవటం వల్ల విద్యార్థులు ఉప్పుటేరు నదిపై పడవలో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ... వేరే ఊరిలోని పాఠశాలకు వెళ్తున్నారు. ఈటీవీ భారత్ చొరవతో...పిల్లలు నదిని దాటే బాధ తప్పిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'వరుస కథనాలపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్' - kalidinhi
కృష్ణ మట్టగుంటలోని 9,10వ తరగతులు లేకపోవటంతో విద్యార్థులు ప్రమాదకరమైన రీతిలో ఉప్పుటేరు నదిని దాటుతున్నారు. దీనిపై వరసు కథనాలు ఈనాడు-ఈటీవీ భారత్ ప్రచురించింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్థానిక పాఠశాలలో 9,10 తరగతులు ప్రవేశపెడతామన్నారు.
'వరుస కథనాలపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్'
ఇవీ చూడండి-ఐదేళ్లుగా ఆ గ్రామంలో యోగా శిక్షణ ఉచితం