ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

All Party Meeting on Tirumala: భద్రతా వైఫల్యానికి బాధ్యులెవరు..?

All Party Leaders Meeting on Tirumala: తిరుమలలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో భద్రతా వైఫల్యంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం నేతలు సమావేశం అయ్యారు. తిరుమలను నువ్వే రక్షించాలి స్వామి.. గోవింద.. గోవిందా.. అంటూ గోడ పత్రికలను విడుదల చేశారు.

All Party Meeting on Tirumala
తిరుమలలో భద్రతా వైఫల్యంపై అఖిలపక్ష సమావేశం

By

Published : May 9, 2023, 3:26 PM IST

All Party Leaders Meeting on Security Failure in Tirumala: తిరుమలలో భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరని అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. తిరుమలను నువ్వే రక్షించాలి స్వామి గోవింద.. గోవిందా అంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేశారు. తిరుమల క్షేత్రంపై డ్రోన్స్ ఎగరవేయడం, గర్భాలయంలోకి సెల్‌ఫోన్లు అనుమతి వంటివి భద్రత వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. తిరుమలలో భద్రతా వైఫల్యంపై తితిదే అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‍ చేశారు. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాలంటూ తితిదే పరిపాలన భవనం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలు పాల్గొన్నారు.

All Party Meeting on Tirumala: భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరు గోవిందా..

"టీటీడీ వెబ్​సైట్​లో ఇతర మతస్థులకు చెందిన ప్రచారం కానీ.. అదే విధంగా తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలోనే సెల్​ఫోన్​తో చిత్రీకరించడం చూశాం. ఇన్ని చర్యలు జరుగుతూ ఉంటే.. టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని అడుగుతున్నాం. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నేడు అఖిలపక్షం నాయకులు అంతా సమావేశం అయ్యాం". - నరసింహ యాదవ్‍, టీడీపీ నేత

  • తిరుమలలో గత కొంతకాలంగా వెలుగుచూసిన భద్రతా వైఫల్యాలు:
    సోషల్​ మీడియాలో ఆనంద నిలయం దృశ్యాలు:నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రతలో మరోసారి లోపం బయటపడింది. కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని ఒకరు సెల్​ ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయం లోపల ఆనంద నిలయాన్ని ఫోన్‌లో వీడియో తీశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం వలనే.. ఇలా జరిగిందని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు: తిరుమల ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు సంచారం.. అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నో ఫ్లయింగ్ జోన్​లో హెలికాప్టర్లు ఎగరడంతో భక్తులు, అధికారులు విస్మయం చెందారు. మూడు హెలికాప్టర్లు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, బాలాజీనగర్, పరకామణి బిల్డింగ్ ఉపరితలంపై ఎగురుతూ కనిపించాయి.

డ్రోన్‌ కలకలం.. వీడియో వైరల్‌:అంతకు ముందు కొన్ని రోజుల క్రితం.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అటువంటి ఆలయంపై.. డ్రోన్‌ ద్వారా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. భద్రతా వైఫల్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు అంటున్నారు. నిరంతరం భద్రతా సిబ్బంది నిఘా ఉండే తిరుమల ఆలయంపై.. ఇలాండి చర్యకు పాల్పడటం గమనార్హం. ఆ వీడియో నిజమైందా కాదా అని దర్యాప్తు చేస్తున్నట్లు అప్పట్లో అధికారులు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details