ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన వైకాపా నాయకులు - srikakulam dst latest news

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం దేరసాం గ్రామంలో.. వైకాపా నాయకులు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ycp leaders  provide grossaries in srikakulam dst echeral consistency
ycp leaders provide grossaries in srikakulam dst echeral consistency

By

Published : May 13, 2020, 1:47 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని దేరసాం పంచాయతీలో పేదలకు వైకాపా నేతలు సరకులు పంచారు. లాక్ డౌన్ ను పరిశీలించి ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

వైకాపా నాయకులు దన్నాన శ్రీనువాసరావు సమకూర్చిన సరకులను.. 640 కుటుంబాలకు వారు పంపిణీ చేశారు. దేశంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అవసరమైన మౌలిక వసతులు లేవని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే కరోనాను తరిమి కొట్టగలమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details