శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ను వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవత్సవ సందర్శించారు. టికెంట్ కౌంటర్లు, గూడ్స్ గోడౌన్ను పరిశీలించారు.
ప్రయాణీకులను చేరవేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో రైల్వే జనరల్ మేనేజర్ పర్యటన ఉన్నందున ముందస్తుగా డీఆర్ఏం పర్యటించినట్లు అధికారులు తెలిపారు.