అంగన్వాడీ కేంద్రాల(anganwadi centres)లో పంచే పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నదుకూరు గ్రామంలో.. మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సరుకులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఓ వ్యాపారి.. గుడ్లు, కందిపప్పు తరలిస్తున్నారని గ్రామస్థులు గుర్తించి నిలదీశారు. అంగన్వాడీ కేంద్రం నుంచి వీటిని తరలిస్తున్నట్లు వ్యాపారి ఒప్పుకున్నాడు. జులై నెలలో పామిడి మండలంలోని బత్తిలి వద్ద అక్రమంగా తరలిస్తున్న పాల ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు కార్యకర్తలను విధుల నుంచి తొలగించినా.. అక్రమాలు మాత్రం ఆగడం లేదు.
Anganwadi: అంగన్వాడీ సరుకులు పక్కదారి..! - అంగన్వాడీ కేంద్రాల నుంచి అక్రమ కొనుగోలు తాజా వార్తలు
చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతూనే ఉంది. అంగన్వాడీ కేంద్రాల నుంచి వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడటంతో.. చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం వ్యాపారులకు చేరుతోంది.
అంగన్వాడీ సరుకులు పక్కదారి