శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే వంతెన వద్ద మహేంద్రతనయ నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నది ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మృతదేహంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని పరివాహక ఒడిశా ప్రాంతం నుంచి ఈ మృతదేహం వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహేంద్రతనయ నదిలో ఆ మృతదేహం ఎవరిది..? - srikakulam district crime latest news update
పాతపట్నం రైల్వే వంతెన వద్ద నదీప్రవాహంలో మృతదేహం కొట్టుకువచ్చింది. మహేంద్రతనయ నదిలో మృతదేహం గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహేంద్రతనయ నదిలో మృతదేహం