Two suspicious deaths శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దన్నానపేట గ్రామంలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన సీతమ్మకు పదేళ్ల క్రితం భర్త చనిపోయారు. గ్రామంలో కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ తన కుమారునితో ఉంటున్నారు. ఈమెకు..కొంత కాలంగా అల్లివలస గ్రామానికి చెందిన అమ్మోరు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వీరిద్దరు సీతమ్మ(30) ఇంట్లోనే విగతజీవులుగా మారాయి. అమ్మోరు(30) అనే వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయినట్లుగా గుర్తించారు. సీతమ్మ మెడపై రక్తపు మరకలు ఉండడంతో ఇద్దరి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటన స్థలంలో ఓ లేఖ లభించిందని పోలీసులు చెబుతున్నారు. ఇరువురు కలిసి జీవించేందుకు సీతమ్మ అత్తమామలు ఒప్పుకోకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి భార్య మూడేళ్లు పాప, మూడు నెలలు బాబు ఉన్నారు.
Two suspicious deaths అనుమానాస్పదంగా ఇద్దరు మృతి, ఎక్కడంటే - అనుమానాస్పద మృతి
Two suspicious deaths శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దన్నానపేటలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.
ఇద్దరు మృతి