ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలల ఉద్ధృతికి ఇద్దరు వ్యక్తులు మృతి - శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్ర తీరంలో ఉద్ధృితికి ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్ర తీరంలో విషాదం నెలకొంది. తీరంలో సరదాగా స్నానం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అలల ఉద్ధృతికి బలయ్యారు.

అలల ఉద్ధృతికి ఇద్దరు వ్యక్తులు మృతి
అలల ఉద్ధృతికి ఇద్దరు వ్యక్తులు మృతి

By

Published : Oct 26, 2020, 8:23 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలాకి మండలం పిన్నింటిపేట పంచాయతీ అప్పారావుపేటకు చెందిన సురేష్.. భార్య పిల్లలతో కలిసి తీరంలో సరదాగా స్నానం చేస్తున్నారు. అయితే అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల కొట్టుకుపోయిన సురేశ్ మృతి చెందాడు. దీంతో భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదే సముద్ర తీరానికి.. పాతపట్నం, టెక్కలి చెందిన ఆరుగురు స్నేహితులు వచ్చారు. మూడేళ్ల ఏళ్ల తర్వాత కలిసి ఆ మిత్రులు సరదాగా సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి పాతపట్నానికి చెందిన వంశీ అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మృతిలో ఆ మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ రెండు ఘటనలపై నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details