ఇద్దరు పసివాళ్లు.. తెలియనితనం కారణంగా ఒకరు మృతిచెందగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. శీతల పానీయంలో చీమల మందు కలుపుకుని తాగిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోగా.. ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలసకు చెందిన విశ్వనాథ నాయుడు, పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. బాబు దేవేంద్ర కుమార్కు 5 ఏళ్లు, పాప హేమశ్రీకు 3 సంవత్సరాలు. మంగళవారం మధ్యాహ్నం తల్లి నిద్రిస్తుండగా పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారు. వారికి చిల్లర డబ్బులు కనిపించాయి. బయటకు వెళ్లి వాటితో శీతల పానీయం కొని తెచ్చుకున్నారు. తెలిసీ తెలియక ఇంట్లో ఉన్న చీమల మందును అందులో కలుపుకుని తాగారు. కాసేపటి తర్వాత తల్లిని లేపి కడుపులో నొప్పిగా ఉందని చెప్పారు.