ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్య అన్నదానానికి వాహన వితరణ - srikakulam updates

పేదలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉపయోగించే వాహనాన్ని... ఆమదాలవలస రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు సనపల రాజబాబు అందించారు. 2 లక్షలు విలువ చేసే ఆ వాహనాన్ని తన తండ్రి రామచంద్ర జ్ఞాపకార్థం అందించానని తెలిపారు.

vehicle and carriages   donated
నిత్య అన్నదానానికి వాహన వితరణ

By

Published : Oct 29, 2020, 6:00 PM IST

నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉపయోగించే వాహనాన్ని,క్యారేజీలను.... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు సనపల రాజబాబు అందించారు . స్థానిక సత్య సాయి బాబా భజన మండలికి...తన తండ్రి రామచంద్ర జ్ఞాపకార్థం అందించానని తెలిపారు.

మూడేళ్లుగా పట్టణంలో ఉన్న పేదల ఇంటింటికి వెళ్లి భోజనం క్యారేజీలను ద్విచక్రవాహనంపై పంపిణీ చేసే వారమని సత్య సాయి బాబా భజన మండలి కన్వీనర్ బంగారు రాజు తెలిపారు. నేడు ఆటో రిక్షా వాహనాన్ని వితరణగా అందించడంతో ఒకేసారి భోజనాల పంపిణీ కార్యక్రమం చేపట్టగలమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్ ఐ ఓ పాతిన పాపారావు, జె వెంకటేశ్వరరావు, ఏం రవీంద్ర బాబు తో పాటు భక్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details