రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దు అనడానికి సీఎం జగన్ ఎవరని.. తెదేపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూన రవికుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీరుపై నరసన్నపేట తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికలు వద్దు అనడానికి సీఎం జగన్ ఎవరు ? : కూన రవికుమార్ - సీఎం జగన్, స్పీకర్ తమ్మినేనిని నరసన్నపేటలో తీవ్రస్థాయిలో విమర్శించిన కూన రవికుమార్
సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంలపై.. తెదేపా నేత కూన రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దు అనడానికి ముఖ్యమంత్రికి ఏం అధికారముందని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా స్పీకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

సీఎం జగన్, స్పీకర్ తమ్మినేనిపై నరసన్నపేటలో తీవ్ర విమర్శలు చేసిన కూన రవికుమార్
రాజ్యాంగ వ్యవస్థలో స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాంకు కనీస అవగాహన లేదని రవికుమార్ విమర్శించారు. ఆయన చదివింది కేవలం ఇంటర్మీడియట్ అని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించబోమని ప్రభుత్వ అధికారులు చెప్పడం.. నేరమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:'ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం'