తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను… మున్సిపల్ కమిషనర్ ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉందని ఆమదాలవలస తెదేపా నియోజకవర్గ ఇంఛార్జీ తమ్మినేని విద్యాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అందించిన ఇళ్ల లబ్ధిదారులను మళ్లీ డబ్బులు కట్టాలని అంటున్నారని… పేదలు ఎలా డబ్బులు కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆ ఇళ్ల పట్టాలు మీకెందుకు?' - తెదేపా ఆమదాలవలస తాజా వార్తలు
ఆమదాలవలస నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో… పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్.. సమావేశాన్ని నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
Vidya sagar
తిమ్మాపురం గాజులకోల్లి వలస ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చిన వారందరికీ గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరు చేసిన విషయం గుర్తుచేశారు. నిజమైన పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోతే… వాళ్ల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.