శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు నేడు తెరుచుకున్నాయి. అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో దర్శనాలకు అనుమతి ఇచ్చారు. నేడు, రేపు స్థానికులకు మాత్రమే సూర్యదేవుని దర్శనం అవకాశం కల్పించారు. ఆదిత్యుని ఆలయంలో బుధవారం నుంచి భక్తులందరినీ దర్శనాలకు అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. సూర్య భగవానుడి దర్శనాలకు వచ్చిన భక్తులుకు థర్మల్ స్కాన్.. శానిటైజర్లలతో పాటు నీటి సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.