రాష్ట్రంలోని దేవాలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి దర్శించుకున్నారు. రానున్న ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేవాలయాలకు మహర్దశ తీసుకొస్తామని తెలిపారు. దర్శనం అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.
దశల వారీగా దేవాలయాల అభివృద్ధి : మంత్రి వెల్లంపల్లి
రానున్న ఐదేళ్లలో రాష్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దశల వారీగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు