ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''కేంద్రం హోదా ఇవ్వనంటోంది.. వైకాపా ఏం చేస్తోంది?'' - శ్రీకాకుళం

''రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది.. ఈ విషయంలో వైకాపా ఎంపీలు ఏం చేస్తారా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు'' అని లోక్​సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. పోలవరం, రాజధాని నిర్మాణాల్లో సమస్యలను ప్రస్తావించారు.

rammohannaidu

By

Published : Jul 9, 2019, 6:09 PM IST

లోక్​సభలో తెదేపా ఎంపీ రామ్మెహన్ నాయుడు

రాష్ట్ర సమస్యలపై... లోక్​సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు గళం వినిపించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు నిధులు కావాలన్నారు. తన సొంత జిల్లా శ్రీకాకుళంతో సహా వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన ప్రత్యేక సహాయనిధికి కేంద్రం మంజూరు చేయాలని కోరారు. బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్‌ విషయంలోనూ తప్పుడు లెక్కలున్నాయని... తాము కేంద్రానికి 16 వేల కోట్ల రూపాయల లోటు ఉందని చెబితే... కేంద్రం మాత్రం 4 వేల కోట్ల లోటే అని చెబుతోందని అన్నారు.

వైకాపా తీరుపై...

వైకాపా అన్నట్లు తమ సంఖ్య లోక్​సభలో 3కు తగ్గిపోయిందన్నది నిజమే అన్న రామ్మోహన్ నాయుడు... తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సంక్షోభంలో లేదని స్పష్టం చేశారు. ఈ సానుకూలతనే అవకాశంగా మలుచుకుని మళ్లీ విజయం సాధిస్తామన్నారు. ఎక్కువ ఎంపీలను గెలిచిన వైకాపా మీదే అందరి కళ్లు ఉన్నాయనీ... వాళ్లు ఎలా ప్రత్యేక హోదా సాధిస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధానితోపాటు హోం, ఆర్థిక మంత్రుల నోటి నుంచి.. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇవ్వబోమనే మాటలు గుర్తు చేశారు. ఈ విషయంలో వైకాపా ఎంపీల వైఖరి ఏంటో చూడలన్నారు.

ABOUT THE AUTHOR

...view details