ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలీబాల్... బ్యాడ్మింటన్ ఆడుతూ వినూత్న ప్రచారం - శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. వినూత్న ప్రదర్శనలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు అభ్యర్థులు. పార్లమెంట్ తెదేపా అభ్యర్థి రామ్మోహన్ నాయుడు బ్యాడ్మింటన్... వాలీబాల్ ఆడుతూ ప్రచారం చేశారు.

వాలీబాల్...బ్యాడ్మింటన్ ఆడుతూ వినూత్న ప్రచారం

By

Published : Apr 3, 2019, 2:38 PM IST

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వినూత్న ప్రచారం
శ్రీకాకుళం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి రామ్మోహన్ నాయుడు వినూత్న ప్రచారం చేశారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడుతూ ఓట్లు అభ్యర్థించారు. క్రీడాకారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవిని గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాలకొండ నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి జయకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ... పార్టీ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details