ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపాడాలని వేడుకున్నాడు... ఇంతలోనే కన్నుమూశాడు... - శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగి మృతి

అమ్మ జాగ్రత్త నేను ఇక బతకను..నన్ను డాక్టర్లు పట్టించుకోవటం లేదంటూ ఓ కరోనా బాధితులు తీసిన సెల్ఫీవీడియో నెట్టింట వైరల్​గా మారింది. స్పందించిన అధికారులు ఆ యువకుడికి వైద్యం చేశారు..కానీ అతను చనిపోయాడు.

srikakulam dst corona patient died due to negligence of doctor he was recently took a selfi video
srikakulam dst corona patient died due to negligence of doctor he was recently took a selfi video

By

Published : Aug 11, 2020, 12:57 PM IST

కరోనాతో ఆస్పత్రిలో చేరిన యువకుడికి ముక్కు నోటి నుంచి రక్తస్రావం కావటంతో తనను వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ శ్రీకాకుళం జిల్లా జీజీహెచ్​లో ఇటీవల సెల్ఫీ వీడియోలో వేడుకున్న పాలకొండ మండలం వెలగవాడకు చెందిన సురేష్​కు (30) మృతి చెందాడు. 15 రోజుల కిందట వీరఘట్టం మండలం రేగులపాడులోని అత్త వారింటికి వెళ్లి జ్వరం బారిన పడ్డాడు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చేరిన తర్వాత తనకు వైద్యం అందటం లేదని ముక్కు నుంచి నోటి నుంచి రక్తం కారుతుందని ఇక తాను బతకని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రాధేయ పడుతూ ఓ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో ద్వారా పంపాడు. స్పందించిన అధికారులు చివరిదశలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. సురేష్​కు రెండు నెలల కిందట బిడ్డ పుట్టి మృతి చెందింది. ఈ బాధలో ఉన్న కుటుంబసభ్యులకు సురేష్ మృతి తీరని దుఖాన్ని మిగిల్చింది.

సంబంధిత కథనం

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

ABOUT THE AUTHOR

...view details