శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని కంటైన్మెంట్ జోన్లలో జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. కంటైన్మెంట్ జోన్ వివరాలను స్థానిక తహసీల్దార్ అమల, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, పట్టణ ఎస్ఐ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. జోన్లలో ఉండే స్థానికులందరికీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సేకరించే నమూనాలు, పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన కిట్లను అందిస్తామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.
ఇచ్చాపురం కంటైన్మెంట్ జోన్లలో పర్యటించిన జిల్లా జేసీ - ఇచ్చాపురం నేటి వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ ప్రాంతాల్లో జిల్లా సంయుక్త పాలనాధికారి పర్యటించారు. ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇచ్చాపురం కంటైన్మెంట్ జోన్లలో పర్యటించిన జిల్లా జేసీ