ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యనారాయణ స్వామి స్వర్ణాభరణాల ప్రదర్శన - అరసవల్లి సూర్యనారాయణ స్వామి బంగారు ఆభరణాల ప్రదర్శన

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి బంగారు ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు. 12 ఏళ్ల తర్వాత ఈనెల 25, 26 తేదీల్లో వెలుగులరేడు.. సూర్యభగవానుడు స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Arasavalli Suryanarayana Swamy
సూర్యనారాయణ స్వామి స్వర్ణాభరణాల ప్రదర్శన

By

Published : Nov 23, 2020, 7:44 PM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి స్వర్ణాభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు. 2008 రథసప్తమి తర్వాత నుంచి ఇప్పటివరకు సూర్యదేవుడు వెండి నగలతోనే భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఇకనుంచి స్వామివారు పర్వదినాల్లో బంగారు ఆభరణాల అలంకరణతో దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఈనెల 25, 26 తేదీల్లో సూర్యభగవానుడు స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఆదిత్యునికి 13 కిలోల 99 గ్రాముల స్వర్ణాభరణాలున్నాయి. కిరీటం నుంచి పాదాల వరకు అన్ని అభరణాలు ఉన్నట్లు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details