శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి లో రాయితీ ఎరువుల పంపిణీ కార్యాక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ఇటీవలి వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన , నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులెవ్వరు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. సిఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రైతులకు ఇచ్చే పరిహారం పై జిల్లా కలెక్టర్లతో మాట్లాడారనీ, ముంపు ప్రాంతాల పంట నష్టం అంచనా వేసి నివేదిక అందించాలని ఆదేశించారని రైతులకు వివరించారు.
పరిహారం చెల్లిస్తాం..అధైర్య పడొద్దు
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ఎరువుల పంపిణీ కార్యాక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నారు
'పంట నష్టానికి పరిహారం చెల్లిస్తాం'