శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను శాసన సభాపతిగా ఎంపిక చేయడం శ్రీకాకుళం జిల్లాకే ఎంతో గర్వకారణమని అన్నారు. వైకాపా విజయం సాధించినందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు.
'రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు'
రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినందుకు కనుగులవలసలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
speaker tammineni veerabhadram visit to the kanugulavalasa village in srikakulam district