శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో సభాపతి సీతారాం గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేకపోయిందని అన్నారు. గతంలో ఏ సమస్య ఉన్నా ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేవారిని... ఇక నుంచి ఆ సమస్య లేకుండా గ్రామ సచివాలయంలోనే పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
గ్రామసచివాలయ భవన నిర్మాణానికి సభాపతి శంకుస్థాపన - speaker tammineni sitharam
బాధ్యత గల అధికారులను అవమానపరిస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం ఉపేక్షించదని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా తోటవాడ గ్రామంలో గ్రామసచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గ్రామసచివాలయ భవన నిర్మాణానికి సభాపతి శంకుస్థాపన
ప్రభుత్వ ఉద్యోగులను అవమానిస్తే కఠిన చర్యలు తప్పవు...
ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్న వారిని అవమానపరచడం, బండ బూతులతో తిట్టడమనేది... సంస్కారం లేనివారు మాత్రమే చేస్తారని సభాపతి అన్నారు. బాధ్యత గల అధికారులు ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నారని ...అటువంటి వారిని అవమానపరిస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు. ఇప్పటికే ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు తమ దృష్టికి తీసుకు వచ్చాయని తెలిపారు.