శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఎస్సీ కాలనీ, అక్కులపేట, చీమలవలస గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ పేడాడ వెంకటరాజు తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని.. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా అధికారుల చర్యలు - ఆమదాలవలస నేటి వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ పర్యటించారు. మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆమదాలవలసలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు