శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కార్గిల్ కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సి.హెచ్ ప్రసాద్‌కు అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేపట్టగా..ఒడిశాలోని రూర్కెలా నుంచి పైడిభీమవరానికి తరలిస్తున్న రూ. 25 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
రూ.25 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత - పాలకొండలో గుట్కా పట్టివేత
పాలకొండ పరిధిలోని కార్గిల్ కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 25 లక్షల విలువైన నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వాహనం