అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్ - srikakulam tekkali latest news update
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి యజమానితోపాటుగా పలుపురిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. భామిని మండలం అంగూరు ఇసుక ర్యాంప్ నుంచి టెక్కలిలోని స్టాక్ యార్డ్‌కు ప్రభుత్వ ఇసుక లారీ రావాల్సి ఉంది. ఇసుకను స్థానికంగా మరోచోట అన్లోడ్ చేయాలని ఏపీఎండీసీ స్టాక్ పాయింట్ సూపర్ వైజర్ చెప్పినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి 30 టన్నుల ఇసుక లోడుతో ఉన్న లారీని పట్టుకొని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు లారీ యాజమాని, స్టాక్ పాయింట్ సూపర్ వైజర్, ఇసుక కొనేందుకు ప్రయత్నించిన వ్యక్తి పై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు.